సత్తెనపల్లి మండలంలోని కంకణాలపల్లి పంచాయతీ పరిధిలో వెన్నాదేవి, వావిలాల నగర్ గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని మాజీ ఎంపీటీసీ సోలా నంబీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఆయా కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.