పండుగలకు చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదరిద్దామని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆదివారం వంగలపూడిలో ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పిలుపు మేరకు తెలుగు ప్రజలు చేనేతలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఒంట్లో నరాలను దారాలు గా పోగు చేసి కష్టపడి రక్తంతో రంగులు అద్దుతూ చెమటోడ్చే చేనేతల బతుకు చిత్రం మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అన్నారు.