తాడికొండ: చికిత్స పొందుతూ యువకుడి మృతి
తాడికొండ మండలంలోని పొన్నెకళ్లుకు చెందిన మురళీకృష్ణ (35) స్థిరాస్తి వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో కుటుంబంలో కలహాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను భయపెట్టాలని అనుకొని విషం తాగాడు. గుంటూరు సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మురళీకృష్ణ మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాడికొండ పోలీసులు చెప్పారు.