కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. శుక్రవారం నుంచి కృష్ణ, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం కోసం శ్రమించి పనిచేయాలని తెనాలి నియోజకవర్గం కూటమి నాయకులకు, కార్యకర్తలకు తెలిపారు.