ఈనెల 15వ తారీకు గుంటూరులో జరిగే మాలల మహా గర్జన సభను విజయవంతం చేయాలని అఖిల భారత మాల సంఘాల జేఏసి అధ్యక్షులు అన్నవరపు కిషోర్ పిలుపునిచ్చారు. శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఐతనగర్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కిషోర్ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తూ ప్రభుత్వం నియమించిన ఏకపక్ష కమిషన్ కు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ జరుగునని తెలిపారు.