కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు వెళుతుందని వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు అన్నారు. బుధవారం చుండూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకు వెళుతున్నారన్నారు. టిడిపి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతతో ముందుకు తీసుకువెళ్లాలన్నారు.