పేద విద్యార్థులు ప్రభుత్వ ఫీజులతో చదువుకునేందుకు కొత్త ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు పి మనోజ్ కుమార్ అన్నారు. మంగళవారం కొల్లూరులో మనోజ్ మాట్లాడుతూ మండలంలో 24 గ్రామాల ప్రజలకు ప్రభుత్వ ఫీజులతో ఇంటర్ విద్యను జివిఎస్ఆర్ అండ్ ఏఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కొల్లూరు మండల టిడిపి అధ్యక్షులు మైనేని మురళీకృష్ణ కు వినతిపత్రం ను అందజేశారు.