వినుకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సీఐ గా దేవర శ్రీనివాసరావు సోమవారం ఉదయం స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన అబ్దుల్ జలీల్ నెల్లూరు జిల్లా కలిగిరి కి బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు ను స్టేషన్ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు.