ఈపూరు గ్రామంలో గురువారం నిర్వహించిన
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొని లబ్దిదారులకు పింఛన్ నగదును అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు వికలాంగులకు ఫించన్ 6వేలు ఇస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు,
టీడీపీ నేత రాపర్ల జగ్గారావు, తదితరులు పాల్గొన్నారు.