కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం మరవకముందే సౌత్ కొరియాలో మరో ప్రమాదం జరిగింది. 175 మంది ప్రయాణికులతో వెళ్తేన్న విమానం Muan ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అవుతుండగా ప్రమాదానికి గురైంది. రన్ వేపై అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.