ర్యాష్ డ్రైవింగ్ ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. హైదరాబాద్‌లోని కోకాపేట్ సర్వీస్ రోడ్డులో బైక్ డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న విద్యార్థి స్వాత్విక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా.. అతని పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన విద్యార్థిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.