AP: విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్లు పేలడంతో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. సంతకవిటి మండలం సిరిపురం గ్రామంలో శనివారం సాయంత్రం ఓ ఇంట్లో ఐదు గ్యాస్ సిలిండర్లు పేలడంతో పది ఇళ్లు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఈ ఘటనపై ప్రాణం నష్టం జరిగిందా? అనేది అధికారికంగా ఎలాంటి సమాచారం తెలియరాలేదు.