అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలాన్ని ఈశాన్య రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. సాధారణంగా ఈ సమయంలో పోర్ట్‌బ్లెయిర్ సమీపంలో ఉండే ‘ఇంటర్-ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్’ తరచూ అల్పపీడనాలను ఉత్పత్తి చేస్తుంది. గతంలో అవి ఏర్పడినా వెంటనే బలహీనపడేవి. కానీ, ఈ ఏడాది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, ఇతర పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో తీవ్రరూపం దాల్చుతున్నాయి. భవిష్యత్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.