అమెరికాలోని ఫ్లోరిడాలో 2 డాలర్లే (సుమారు రూ.170) టిప్ ఇచ్చిందని బ్రియానా అల్వేలో అనే 22 ఏళ్ల పిజ్జా డెలివరీ గర్ల్ ఓ గర్భిణీని 14 సార్లు కత్తితో పొడిచింది. కాళ్లు చేతులు, పొత్తికడుపుపై గాయాలతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డెలివరీ ఇచ్చాక టిప్ సరిపోదంటూ అసహనంతో వెళ్లిన బ్రియానా, గంటన్నర తర్వాత మరో వ్యక్తిని వెంటబెట్టుకొచ్చి దాడి చేసింది. ఈ సమయంలో బాధితురాలి 5 ఏళ్ల పాప కూడా అక్కడే ఉంది.