దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం లైవ్ దృశ్యాలు బయటకు వచ్చాయి. ముయూన్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై విమానం (7c2216) అదుపు తప్పి రక్షణగోడను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి విమానం పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 28 మంది మరణించినట్లు తెలిసింది. మిగతా వారి క్షేమ సమాచారం తెలియాల్సి ఉంది.