AP: భోగాపురం విమానాశ్రయం పనులు 71 శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో భోగాపురం ఎయిర్‌పోర్టు ఒక్కటే అత్యంత అధునాతనమైనదని ఆయన వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టుతో దేశ రూపురేఖలు మారనున్నట్లు తెలిపారు. మంగళవారం భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించిన రామ్మోహన్.. అక్కడ జరుగుతున్న పనుల్లో పురోగతిపై GMR ప్రతినిధులతో సమీక్షించారు. 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తవుతుందన్నారు.