స్కోడా ఆటో ఇండియా తన రెండవ తరం ‘స్కోడా కోడియాక్’ SUV టీజర్‌ను విడుదల చేసింది. దీంతో కంపెనీ త్వరలోనే ఈ కారును మార్కెట్‌లోకి విడుదల చేయొచ్చని భావిస్తున్నారు. ఈ కారును భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలోనూ ప్రదర్శించారు. ఈ కొత్త మోడల్ ఏడు సంవత్సరాలకు పైగా ఉన్న స్కోడా కోడియాక్ ప్రస్తుత మోడల్‌కు సక్సెసర్‌గా వస్తోంది.