1992 నాటి హర్షద్ మెహతా కుంభకోణం భారతదేశ చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనంగా పరిగణిస్తారని ‘హిందుస్తాన్ టైమ్స్’ తెలిపింది. ఆ తర్వాత 1997లోని ఆసియా ఆర్థిక సంక్షోభం, 2000ల ప్రారంభంలో డాట్-కామ్ బబుల్ పేలుడు, 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 2020లో COVID-19 మహమ్మారి క్రాష్ ఉన్నాయి. తాజాగా అమెరికా సుంకాల గందరగోళం మధ్య స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్‌లో భారీగా కుప్పకూలాయి.