బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ దేశానికి తిరిగి వెళ్లనున్నట్లు తాజాగా ప్రకటించారు. అలాగే మహమ్మద్ యూనస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 'యూనస్‌కు ప్రజల మీద ప్రేమ లేదు. అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి ఆయన విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. అవామీ లీగ్ పార్టీ సభ్యులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది. త్వరలోనే బంగ్లాకు తిరిగి వస్తా' అంటూ పేర్కొన్నారు.