తిరుమల లడ్డూ ప్రసాదం తయారీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. గత పాలనలో నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని చంద్రబాబు అన్నారు. దీనిపై వైసీపీ హయాంలో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. 'తిరుమల లడ్డూలో జంతువుల నూనె కలిపిన వారిని ఆ వెంకన్న సర్వనాశనం చేస్తారు. అది కలపలేదని తేలితే చంద్రబాబు కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. టీటీడీ విజిలెన్స్ కమిటీలో ఓ ముస్లిం వ్యక్తిని విచారణ అధికారిగా ఎలా నియమించారు?' అంటూ భూమన ఫైర్ అయ్యారు.