సజ్జలకు బిగ్ షాక్.. ఈసీ కీలక ఆదేశాలు

84చూసినవారు
సజ్జలకు బిగ్ షాక్.. ఈసీ కీలక ఆదేశాలు
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, వైసీపీ సామాజిక విభాగం ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వకుండా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకుంటున్నారని భార్గవ్ రెడ్డి చేయిస్తున్న దుష్ప్రచారంపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని, బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఐడీని ఆదేశించారు.