వైసీపీకి త్వరలోనే మరో షాక్ తగలనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలినేని శ్రీనివాస రెడ్డి, అవంతి శ్రీనివాస్ పార్టీని విడగా తాజాగా బొత్స సత్యనారాయణ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా? అన్న సందేహం కలుగుతోంది. దీనికి కారణం మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్‌తో బొత్స భేటీ అయ్యారు. ఆయనను ఆత్మీయంగా పలుకరించి, ఆరోగ్యంపై ఆరా తీశారు. దీంతో బొత్స జనసేనలో చేరనున్నరా అన్న సందేహం వ్యక్తమవుతోంది.