చెన్నైలోని తిరువణ్ణామలై జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ప్రియురాలిని బావిలో తోసి ప్రియుడు కడతేర్చాడు. కలసపాక్కంకు చెందిన రోషిణి (21).. అలనార్కమంగళానికి చెందిన శక్తివేల్ (29) ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ ఇంటికి వెళ్తుండగా శక్తి పెళ్లి చేసుకుందామని అడగగా.. రోషిణి నిరాకరించింది. దీంతో వారి మధ్య గొడవ జరగడంతో కోపంతో శక్తి.. రోషిణిని బావిలోకి నెట్టడంతో యువతి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.