AP: సీఎం చంద్రబాబు పామును పెంచినట్లు పవన్ కళ్యాణ్‌ను పెంచారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. మంగళవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. "వైఎస్ జగన్ ఇప్పటికైనా తనను ఓపెన్‌గా కలిస్తే రెడ్ బుక్‌ను ఏడు రోజుల్లో క్లోజ్ చేసి కేఏ పాల్ బుక్కు ఓపెన్ చేస్తాను. ఒక్క వైసీపీ నాయకుడిపై కూడా కేసు లేకుండా చేస్తా. రాజకీయాలు పక్కన పెట్టి చంద్రబాబు కలిసి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా." అని అన్నారు.