TG: ఒకప్పుడు యూట్యూబర్లు అంటే ట్రావెల్, హెల్త్, షార్ట్ ఫిల్మ్, వంటలకి ఉపయోగపడే వీడియోలు చేసేవారు. అలాంటి వీడియోల మధ్యలో ప్లే అయిన యాడ్స్ ద్వారా వారికి గూగుల్ డబ్బులు చెల్లించేది. అయితే కొందరు ఎక్కువ డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ గేమ్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి వీడియోలను చూసిన సామాన్యులు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.