ఐఎస్ఎస్‌లో 9 నెలల పాటు గడపాల్సి వచ్చినా సునీత ఎక్కడా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. తన పరిస్థితిపై కూడా తరచూ జోకులు పేల్చారు. నడవటమెలాగో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నానంటూ గత జనవరిలో నాసా సెంటర్‌తో మాట్లాడుతూ చమత్కరించారు. సహచరులతో కలిసి సునీత, విల్మోర్ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. వీడియో కాల్స్ ద్వారా తమ కుటుంబీకులతో టచ్లో ఉంటూ వచ్చారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు.