పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ చిత్రం 'ఎల్2: ఎంపురాన్'. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో విడుదల కానుంది. అయితే ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో విడుదలవుతున్న తొలి మలయాళ చిత్రంగా 'L2 ఎంపురాన్' నిలవనుంది. మలయాళ బ్లాక్‌బస్టర్ 'లూసిఫర్' సినిమాకు ఇది సీక్వెల్ విత్ ప్రీక్వెల్‌గా రానుంది.