గేమ్ ఛేంజర్ జనవరి 10న ప్రపంచ వాప్తంగా రిలీజ్ కానుంది. అయితే మూవీ ప్రమోషన్స్ పెద్దఎత్తున చేపట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 21న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఇలా సుమారు 20 రోజుల పాటు నాన్ స్టాప్ ప్రమోషన్ చేయనున్నారు. ఇటు బన్నీ, అటు తారక్ ఇద్దరూ హిట్లు కొట్టడంతో రామ్ చరణ్ కూడా ఎలాగైనా హిట్టు కొట్టాలని ప్రమోషన్స్ పెద్దఎత్తున చేపట్టనున్నారు.