చలికాలంలో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజామున శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయి రక్తనాళాలు కుంచించుకుపోయి గుండెపోటు వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. దీనిని నివారించాలంటే శరీరాన్ని వేడిగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వేడినీటితో స్నానం చేయడం, చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయటతిరగకపోవడం మంచిదని వివరిస్తున్నారు.