BREAKING: టీడీపీ కార్యకర్త దారుణ హత్య

66చూసినవారు
BREAKING: టీడీపీ కార్యకర్త దారుణ హత్య
అనంతపురం జిల్లాలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. తాడిపత్రి పట్టణం నందలపాడు కాలనీలో నివాసముంటున్న టీడీపీ కార్యకర్త లాల్ బాషా దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో నిద్రిస్తున్న లాల్ బాషాపై గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి పరారయ్యారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్