పెట్రోల్ ధరల పెంపును సమర్థించిన కర్ణాటక సీఎం

52చూసినవారు
పెట్రోల్ ధరల పెంపును సమర్థించిన కర్ణాటక సీఎం
కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీఎం సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారుఈ నిర్ణయంతో ప్రజాసేవలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూరుతాయని చెప్పారు. కర్నాటకలో పెరిగిన ధరలు చాలా రాష్ట్రాల కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాగా పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3.02లను కర్ణాటక ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ రూ.103, డీజిల్ రూ.89గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్