ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై యువకులు దాడి

80చూసినవారు
ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై యువకులు దాడి
నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. మిడుతూరు మండలం చింతలపల్లిలో రోడ్డుపై వెళ్తున్న బస్సును గుర్తు తెలియని యువకులు ఆపి రెచ్చిపోయారు. బస్సు కండక్టర్‌పై దాడికి పాల్పడి పారిపోయారు. ఈ దాడిలో కండక్టర్‌కు గాయాలయ్యాయి. దాంతో అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్