AP: సీఎం చంద్రబాబు అద్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ జిల్లాకు కడప పేరు కలిపారు. దీంతో ఇకపై వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా పరిగణించనున్నారు. గతంలో వైఎస్ఆర్ కడప జిల్లాగా ఉన్న పేరును వైసీపీ ప్రభుత్వం జిల్లా పేరులోని కడపను తొలగించింది.