పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

18034చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ
పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టత ఇచ్చింది. 13ఏ ఫాంపై అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని ఈసీ తెలిపింది. 13ఏ ఫాంపై సీల్, హోదా లేకున్నా చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే అటెస్టేషన్ అధికారి 13ఏ ఫాంపై సంతకం చేశారని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు వాటిని చెల్లుబాటయ్యే ఓటుగా గుర్తించాలని రిట్నరింగ్ అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏపీ సీఈవోకు లేఖ రాసింది.

సంబంధిత పోస్ట్