AP: ఫెంగల్ తుఫాన్ గడిచిన 6 గంటల్లో 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ పుదుచ్చేరికి 10 కి.మీ, చెన్నైకి 100 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. శనివారం సాయంత్రానికి కారైకాల్-మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశముందని స్పష్టం చేసింది. ఈ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.