గొంతులో గారే అడ్డుపడి వృద్ధురాలు మృతి

67చూసినవారు
గొంతులో గారే అడ్డుపడి వృద్ధురాలు మృతి
ఖమ్మం జిల్లా తల్లెడలో విషాదం చోటుచేసుకుంది. గొంతులో గారే అడ్డుపడడంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడకు చెందిన తిరుపతమ్మ (80) పెద్ద కొడుకు వద్ద ఉండేది. అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో చిన్న కుమారుడు గారెలు తెచ్చి ఇచ్చాడు. తిరుపతమ్మ ఆ గారెలను తింటుండగా గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్