తెలుగు స్టార్ దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత స్టేజిపై కంటనీరు పెట్టుకున్నారు. తన కుమార్తె సుకృతి వేణి గురించి చెబుతూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. టీనేజీలో ఏ అమ్మాయి గుండు చేయించుకోవడానికి ఇష్టపడదని, ‘గాంధీ తాత చెట్టు’ సినిమా కోసం తన కుమార్తె చేయించుకుందంటూ ఆమె కంటతడి పెట్టుకున్నారు. ఈ నెల 24న ‘గాంధీ తాత చెట్టు’ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె ఎమోషనల్ అయ్యారు.