ఒకే బంతికి 286 పరుగులు రావడమేంటి అనుకుంటున్నారా? అవును ఇది నిజమే. ఈ అరుదైన రికార్డ్ 130 ఏళ్ల క్రితమే జరిగింది. 1894లో పశ్చిమ ఆస్ట్రేలియాలో విక్టోరియా వర్సెస్ స్క్రాచ్-XI మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది జరిగింది. విక్టోరియా బ్యాటర్ కొట్టిన బంతి వెళ్లి బౌండరీ లైన్ లోపలే ఉన్న చెట్టుకొమ్మ మధ్యలో చిక్కుకుపోయింది. దానిని తీసేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి రైఫిల్‌తో బంతిని గురిపెట్టి పేల్చారు. ఈలోపు బ్యాటర్లు 286 పరుగులు చేశారు.