ఢిల్లీలో మళ్లీ మద్యం పాలసీని అమలు చేసేందుకు సీఎం ఆతిశీ మొగ్గు చూపుతున్నారంటూ బీజేపీ ఆరోపించింది. ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే మద్యం పాలసీని అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనేక రాష్ట్రాలు అవలంబించిన ఈ మద్యం పాలసీ ద్వారా గణనీయంగా ఆదాయం పెరిగిందని సీఎం ఆతిశీ అన్నారు. ఆతిశీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. దేశ రాజకీయ చరిత్రలో ఇది చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని విమర్శించింది