AP: ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టబోయే వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. వక్ఫ్ బిల్లుపై తన పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. లోక్‌సభలో వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. వక్ఫ్ బిల్లుకు చేసిన సవరణలను కూడా ఆయన ఆమోదించారు. టీడీపీ ఎంపీలంతా బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని విప్ జారీ చేశారు.