గుజరాత్ లోని దీసా పట్టణంలో మంగళవారం బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు సంబంవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య 21 చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో ఐదుగురు పిల్లలు, ఐదుగురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. వీరంతా మధ్యప్రదేశ్‌లోని హర్దా, దేవాస్ జిల్లాల నుండి వచ్చిన కార్మికులుగా అధికారులు నిర్దారించారు.