AP: ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్లలో పింఛన్ సొమ్ముతో సచివాలయ ఉద్యోగి పరారయ్యాడు. కంచికచర్ల సచివాలయం-3లో వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమార్ మంగళవారం పంపిణీ చేయాల్సిన డబ్బుతో పారిపోయాడు. ఈ విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులు గుర్తించారు. రూ.7.50 లక్షలతో పరారయ్యాడని అధికారులు తెలిపారు. కాగా, తోట తరుణ్ వెల్ఫేర్ అసిస్టెంట్‌గా జులైై నెల నుంచి పని చేస్తున్నాడు.