AP: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి చేరుకున్నారు. కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న ఆయన అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని నివాసానికి వెళ్లారు. మరోవైపు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు.