చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో విజయవాడ కృష్ణా నదిలో పడవలతో ప్రదర్శన నిర్వహించారు. మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ర్యాలీ తీశారు. అమరావతి పడవల యాజమాన్యం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పడవలపై టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు కనిపించాయి.