చంద్రబాబుపై తిరుపతి శాసన నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ఫైర్ అయ్యారు. "గతంలో వాలంటీర్లను సంఘ విద్రోహులు, దొంగలు అని చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో వారి గురించి గొప్పగా ఆయన మాట్లాడుతున్నారు. గతంలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి." అని అభినయ్ డిమాండ్ చేశారు. తిరుపతిలో ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఈ మేరకు మాట్లాడారు.