పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని బత్తలవారి పల్లిలో నూతనంగా నిర్మించిన కార్య సిద్ధి ఆంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవ పూజలు ఈనెల 17 నుంచి నిర్వహించనున్నట్టు నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. వారు మాట్లాడుతూ 17న గణపతి పూజ, దీపారాధన, హోమాలు, 18న హోమాలు, పంచామృతాభిషేకం, ఊరేగింపు, అన్నదానం, పాటకచేరి నిర్వహిస్తామన్నారు. 19న విగ్రహ ప్రతిష్ఠాపన, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు.