

పుంగనూరు: రాతి మసీదులో సమావేశమైన ముస్లిం మత పెద్దలు
బక్రీద్ పండుగను పురస్కరించుకొని గురువారం పుంగనూరు పట్టణంలోని రాతి మసీదు లో ముస్లిం మత పెద్దలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమై ఎనిమిది గంటలకు బసరాజ కళాశాల మైదానానికి చేరుకొని నమాజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ సమయాన్ని గుర్తుంచుకోవాలని మత పెద్దలు కోరారు.