

పుంగనూరు: విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
పుంగనూరు నియోజకవర్గం, సదుంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో నూతన వినాయక విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం పాల్గొన్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జడ్పిటిసి సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, విగ్రహ దాత కృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.