ఎండపల్లి మండలం కొత్తకోట గ్రామ మార్కండేయ స్వామి గుడి నిర్మాణ, అభివృద్ధి పనుల నిమిత్తం అధ్యక్షుడు నడిమెట్ల పురుషోత్తంకు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు కందికట్ల రాజేష్ సోమవారం 10 వేల 5 రూపాయలు విరాళంగా అందించి ఉదారతను చాటుకున్నారు. అధ్యక్షుడు నడిమెట్ల పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి దాసరి భీమయ్య, కోశాధికారి నడిమెట్ల హన్మండ్లు, ముఖ్య సలహాదారు ఎనగంటి శ్రీనివాస్, సత్తయ్య, మల్లయ్యలు పాల్గొన్నారు.