తిరుపతి: ప్రజలకు 'వారాహి' వేదన

62చూసినవారు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతిలో నిర్వహించిన వారాహి సభతో ప్రజలను తీవ్రంగా ఇబ్బందిపెట్టారని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్. హరికృష్ణ మండిపడ్డారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ నగర నడిబొడ్డున మీటింగ్ పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. దీంతో చంద్రగిరి వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారని, దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్